TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..ఈ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వ్రుద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు సహా అన్ని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అదనపు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య తెలిపారు.

Update: 2024-09-19 02:56 GMT

TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..ఈ రోజుల్లో ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

Tirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం వ్రుద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు సహా అన్ని ప్రత్యే క దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. అక్టోబర్ 8న జరిగే గరుడసేవ కోసం పలు శాఖ ఉన్నతాధికారులతో స్థానిక గోకులం గెస్టుహౌజులో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

గరుడ సేవను పురస్కరించుకుని అక్టోబర్ 7వ తేదీ రాత్రి 9గంటల నుంచి అక్టోబర్ 9 నుంచి ఉదయం 6 గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో టూవీలర్స్ రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు.

ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు తొమ్మిదిరోజుల పాటు 16 వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. గతేడాది నిర్వహించినట్లే ఈ ఏడాది కూడా వాహన సేవలను ఉదయం 8గంటలకు నిర్వహిస్తే..రాత్రి 7గంటలకే ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం సాయంత్రం 05.54 నుంచి 06.00వరకు బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ కార్యక్రమమును అర్చకులు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్నారు. దీంతో బ్రహ్మోతవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అదే రోజు సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపును సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Tags:    

Similar News