TTD EO: కాలినడక మార్గంలో ప్రతి 10 మీటర్లకో సెక్యూరిటీ గార్డు.. సాయంత్రం 6 తర్వాత కాలినడక బాటల మూసివేత?

Tirumala: చిరుత దాడిలో బాలిక మృతి చెందడం చాలా బాధాకరమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు.

Update: 2023-08-12 10:10 GMT

TTD EO: కాలినడక మార్గంలో ప్రతి 10 మీటర్లకో సెక్యూరిటీ గార్డు.. సాయంత్రం 6 తర్వాత కాలినడక బాటల మూసివేత?

Tirumala: చిరుత దాడిలో బాలిక మృతి చెందడం చాలా బాధాకరమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. నడకదారిలో మరింత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. 500 సీసీ కెమెరాలతో వన్యమృగాలు మూమెంట్స్ పరిశీలిస్తామన్నారు. గాలి గోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు భద్రత మరింత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. ప్రతి పది మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డును నియమిస్తామన్నారు.

చిన్నపిల్లలతో నడకదారిలో వచ్చే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు పాటించాలన్నారు. హై అలర్ట్ జోన్ లో బోన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకు అలిపిరి నడకదారిలో భక్తులను అనుమతిస్తున్నామని, వన్యమృగాల సంచారం దృష్డ్యా రెండు కాలినడక బాటలను సాయంత్రం 6 గంటలకు మూసేయాలని ఆలోచిస్తున్నాం. టీటీడీ ఛైర్మన్‌, అధికారులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటాం అని ఈవో ధర్మారెడ్డి సూచించారు. 

Tags:    

Similar News