TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్...డిసెంబర్ నెల దర్శన టికెట్లు విడుదల

TTD:తిరుమలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో బిగ్ అలర్ట్. దర్శన టికెట్ల విడుదలయ్యేది ఎప్పుడో తెలిసిపోయింది. అందుకే మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే డిసెంబర నెలలో శ్రీవారి దర్శనానికి వెంటనే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

Update: 2024-09-16 02:13 GMT

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని ప్లానింగ్ చేసినవారికి ముఖ్యగమనిక. శ్రీవారి దర్శన టికెట్లు బుకింగ్ కు రెడీగా ఉండాల్సిందే. డిసెంబర్ నెల టికెట్లు త్వరలోనే విడుదల కానున్నాయి. మీరు డిసెంబర్ నెలలో తిరుమలకు వెళ్లాలని ప్లాన్ చేసినట్లయితే టికెట్లు విడుదలైన వెంటనే బుక్ చేసుకోవడం చాలా ఉత్తమం.

డిసెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు ఈనెల 19వ తేదీన విడుదల కానున్నాయి. మీరు తిరుమల వెళ్లాలని ప్లాన్ లో ఉంటే మాత్రం ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టికెట్లు ఇలా రాగానే అలా అయిపోతుంటాయి. ఎంత ఫాస్టుగా బుక్ చేసుకుంటే అంత ఫాస్టుగా బుక్ అవుతుంటాయి.

మరోవైపు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 3 రోజులపాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్ర‌హణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం జరిగింది.

ఆలయంలో తెలియక దోషాలు జరిగిన యెడల ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రకు ఎలాంటి లోపం రానీయ్యకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం లాంటి కార్యక్రమాలను ఈ రోజుల్లో నిర్వహిస్తుంటారు.

ఈ సందర్భంగా సెప్టెంబర్ 16వ తేదీన పవిత్రప్రతిష్ట, సెప్టెంబర్ 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబర్ 18 పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. రూ. 750 చెల్లించి గ్రుహస్తులు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గ్రుహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు అందజేస్తారు. ఇక సెప్టెంబర్ 17వ తేదీన అనంత పద్మనాభ వ్రతాన్ని టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది.

ఈ సందర్భంగా ఉదయం 6గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తళ్వారును ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ భువవరాహస్వామి ఆలయం పక్కన ఉన్న స్వామివారి పుష్కరిణి చెంతకు అర్చకులు ఆగమోక్తంగా తీసుకెళ్లి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

Tags:    

Similar News