చీరాల వైసీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
* ఆమంచి, కరణం మధ్య వర్గపోరు * ఇళ్ల పట్టాల పంపిణీలో మధ్య మాటల యుద్ధం * స్టేజ్‌పైనే వాదులాడుకున్న నేతలు
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నేతల మధ్య మాటలు భగ్గుమన్నాయి. స్టేజ్‌పైనే ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావుల మధ్య వాగ్వాదం జరిగింది. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే బలరాంని గెలిపించాలని పాలేటి రామారావు అంటే... ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదని పోతుల సునీత అడ్డుకున్నారు. అధినేత ఇచ్చే టికెట్ విషయం ఇప్పుడేందుకని సునీత ఫైర్ అయ్యారు. దీంతో కోపంతో ఊగిపోయిన బలరాం సునీతను నెట్టేశారు. ఇది ఒంగోలు రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది.
అయితే.. ఇరు వర్గాల మధ్య ఇటీవల విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాడరేవు మత్స్యకారుల మధ్య జరిగిన వివాదానికి ఆమంచి వర్గమే కారణమని కరణం వర్గం ఆరోపణలు చేసింది. దాంతో పాటు.. ఇటీవల ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకల్లో కూడా ఇరు వర్గాలు ఎవరికి వారే చేసుకున్నారు. ప్లేక్సిలు ఏర్పాటు చేస్తే మరో వర్గం తీసేయించింది. ఇప్పుడు ఇళ్ల పట్టాల సందర్భంలో ఇరు వర్గాల మధ్య మాటల జరిగింది.