Chandrababu Naidu Praises Sonu Sood: సోనూసూద్ ను అభినందించిన చంద్రబాబు!

Chandrababu Naidu Praises Sonu Sood: కష్టం ఎక్కడుంటే నటుడు సోనూసూద్‌ అక్కడ ఉంటున్నాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కూలీలు, కార్మికుల‌ను

Update: 2020-07-27 07:50 GMT
chandrababu, sonusood (File Photo)

Chandrababu Naidu Praises Sonu Sood: కష్టం ఎక్కడుంటే నటుడు సోనూసూద్‌ అక్కడ ఉంటున్నాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో వ‌ల‌స కూలీలు, కార్మికుల‌ను వారివారి స్వస్థలాలకు చేరుస్తూ వారి పాలిట సోను సూద్‌ దేవుడుగా నిలిచాడు. సినిమాల్లో విలన్ అయినప్పటికీ అంద‌రి దృష్టిలో ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. ఇక తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన రైతు కుటుంబ కష్టాలను తెలుసుకొని కొన్ని గంటల్లోనే అతని సమస్యను పరిష్కరించారు సోనూసూద్‌ .. దీనితో సోనూసూద్‌ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది.

త‌న సొంత జిల్లాకి చెందిన రైతుకి సోనూసూద్ సాయం చేయ‌డంతో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు త‌న ట్విట్టర్ స్పందిస్తూ సోనూసూద్ కి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా సదరు రైతు ఇద్దరు కూతుళ్ళ బాధ్యత తాను తీసుకుంటాన‌ని చంద్రబాబు వెల్లడించారు. ఇలాగే ఇంకిన్ని మంచిపనులను చేయాలనీ సోనూసూద్ ను అభినందించారు చంద్రబాబు.. అలానే సోనూసూద్‌తో ఫోన్‌లో మాట్లాడిన‌ట్టు కూడా తెలిపారు. ఇక దీనిపైన సోనూసూద్ స్పందిస్తూ.. న‌న్ను ప్రోత్సహిస్తూ మీరు చెప్పిన మాట‌ల‌కి ధ‌న్యవాదాలు అని పేర్కొన్నాడు. ల‌క్షల మంది తమ క‌ల‌ల‌ని సాకారం చేసుకునేందుకు దారులు వెతుక్కుంటున్నారు. ఇలానే మీరు స్పూర్తి నింపండి స‌ర్‌. త్వర‌లో మ‌నం క‌లుద్దాం అంటూ ట్వీట్ చేశాడు సోనూసూద్ .

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరు జిల్లాకు మహల్‌ రాజపల్లిలో రైతు నాగేశ్వరరావు తన కుమార్తెలతో పొలం దున్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కాస్తా సోనూసూద్‌ దృష్టికి వచ్చింది. దీనితో ముందుగా సోనూసూద్‌ రేపు ఉదయానికల్లా ఎద్దులు కొనిస్తానని అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఎద్దులు కాదు ట్రాక్టర్‌ కొనిస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చినట్టుగానే కొద్ది గంటల్లోనే చిత్తూరు జిల్లా మదనపల్లెలో ట్రాక్టర్‌ ని బుక్ చేశాడు. దీంతో షోరూమ్‌ వాళ్ళు రైతు నాగేశ్వరరావుకు ఆదివారం సాయంత్రం ట్రాక్టర్‌ను అందజేశారు.

Tags:    

Similar News