Meena: బండారు సత్యనారాయణ వెంటనే రోజాకు క్షమాపణలు చెప్పాలి
Meena: బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించి చర్యలు తీసుకోవాలి
Meena: మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా.. రోజాకు మద్దతుగా నటులు గళం విప్పుతున్నారు. ఇప్పటికే రోజాకు నవనీత్ కౌర్, కుష్బూ, రాధిక మద్దతుగా నిలవగా.. తాజాగా నటి మీనా కూడా బండారు వ్యాఖ్యలను ఖండించారు. సత్యనారాయణ వెంటనే రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రోజా గురించి నీచంగా మాట్లాడే హక్కు బండారుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. బండారు చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.