Suman: గోవును పూజించాలి.. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి
Suman: గోవును రక్షించాలనే భావన అందరిలో ఉండాలి
Suman: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, ప్రధాని మోడీ ఆ దిశగా ఆలోచించాలని ప్రముఖ సినీనటుడు సుమన్ కోరారు. సేవ్ కప్-సేవ్ ఎర్త్ అనే నినాదంతో హైదరాబాదు నుంచి అరుణాచలం వరకు చేపట్టిన గో మహాపాదయాత్ర తిరుపతికి చేరుకుంది. కపిలతీర్థం సమీపం నుంచి సినీనటుడు సుమన్ గోమహాపాద యాత్రకు సంఘీభావం తెలిపి అలిపిరి వరకు కొనసాగారు. ఆవును రక్షిస్తే భూమిని రక్షిస్తాం అనడంలో చాలా అర్ధం ఉందన్నారు. తల్లిపాల తర్వాత గోక్షీరమే చంటిబిడ్డలకు పడతామని గుర్తు చేశారు. గోవును పూజిస్తే అంతా శుభం జరుగుతుందని ప్రజల విశ్వాసమన్నారు. ఇన్ని ఉపయోగాలున్న గోవును రక్షించాలనే భావన అందరిలోనూ ఉండాలన్నారు.