తిరుమల ఏడుకొండలపై ఉత్తరాది నటి అర్చన రచ్చ వివాదం

*టీటీడీ ప్రతిష్టకు భంగం కల్గించే ప్రయత్నించారంటూ అధికారుల ఆరోపణలు

Update: 2022-09-07 10:27 GMT

తిరుమల ఏడుకొండలపై ఉత్తరాది నటి అర్చన రచ్చ వివాదం 

Archana Gautam: ఉత్తరాది నటి అర్చనగౌతమ్ తిరుమల ఏడుకొండలపై చేసిన రచ్చ వివాదానికి దారితీసింది. బాలివుడ్ సినిమాల్లో సీరియల్స్ లో నటిస్తూ సెలబ్రటిగా గుర్తింపు పొందిన అర్చన కేంద్ర మంత్రి సిఫార్సు లెటర్ తో వెంకన్న దర్శనానికి వచ్చింది. అయితే టీటీడీ సిబ్బంది అడ్డుకోవడంతో గొడవకు దిగింది అర్చన. తన పట్ల దురుసుగా ప్రర్తించారంటూ ఏడుస్తూ వీడియో క్లిప్పింగ్స్ ను రిలీజ్ చేసింది. 

ఇప్పుడు ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారి చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాల్లో ఈ విడియోలు మార్మోగుతుండటంతో టీటీడీ రంగంలోకి దిగింది. టీటీడీ ప్రతిష్టకు భంగం కల్గించే విధంగా ప్రయత్నిస్తున్నారని భక్తులు అవాస్తవాలు నమ్మొద్దంటూ అధికారులు విజ్ఞప్తి చేస్తుండగా తనకు న్యాయం చేయాలంటూ ట్విట్టర్ ఖాతాలో ఏపి ప్రభుత్వాన్ని అభ్యర్ధించింది నటి అర్చన గౌతమ్.



Tags:    

Similar News