Kuppam: వైసీపీలో వర్గవిభేదాలు.. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్న కార్యకర్తలు
Kuppam: రోడ్డుపై బైఠాయించిన 5 గ్రామాల ప్రజలు, వైసీపీ కార్యకర్తలు
Kuppam: చిత్తూరు జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో వైసీపీ నేతల మధ్య వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. శాంతిపురం మండలానికి చెందిన ముఖ్య నేత దండపాణికి వ్యతిరేకంగా ఓ వర్గం ఆందోళనకు దిగింది. మోరసనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన నేపథ్యంలో.. ఆయన కాన్వాయ్‌ను అసమ్మతి నేతలు అడ్డుకున్నారు. దండపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను అరికట్టాలంటూ 5 గ్రామాలకు చెందిన ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను నియోజకవర్గ నాయకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. ఇక.. అదే సమయంలో అటుగా వస్తున్న మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. ఆందోళనకారులకు సర్దిచెప్పడంతో.. వివాదం సద్దుమణిగింది.