Telugu Akademi Case: తెలుగు అకాడమీ కేసులో పద్మనాభన్ అరెస్ట్
*బ్యాంక్ డిపాజిట్ల పత్రాలను కలర్ జిరాక్స్ తీసి ఫోర్జరీ చేసిన పద్మనాభన్ *కోయంబత్తూర్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
Telugu Akademi Case: తెలుగు అకాడమీ కేసులో పద్మానభంను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ డిపాజిట్ల పత్రాలను కలర్ జిరాక్స్ తీసి ఫోర్జరీ చేశారు పద్మనాభన్‌ను కోయంబత్తూర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పరారీలోనే కృష్ణారెడ్డి, భూపతి, యెహన్, రమణారెడ్డి ఉన్నారు. వీరంతా ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఫేక్ అకౌంట్స్, ఐడీ లు సృష్టించారు నిందితులు. మరోవైపు నేడు మూడవ రోజు కస్టడికి యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ హాజరుకానున్నారు.
అరెస్ట్ అయిన ఇతర నిందితులను సైతం కస్టడికి కరారు. పోలీసులు ఇక తెలుగు అకాడమీ కేసులో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. సీపీఎస్ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్ కింది దర్యాప్తు చేయనునుంది ఈడీ.