Madanapalle: జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్

Madanapalle: చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్

Update: 2021-04-27 14:48 GMT
పురుషోత్తం ఫైల్ ఫోటో

Madanapalle: చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. జనవరి 24వ తేదీ మూఢ భక్తితో కన్న కూతుళ్లు ఇద్దరినీ పురుషోత్తం దంపతులు దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.

కాగా, మదనపల్లెలోని శివనగర్‌లో పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు నివాసముంటున్నారు. పురుషోత్తం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌గా, ఆయన భార్య పద్మజ ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థ కరస్పాండెంట్‌, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (23) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూఢభక్తితో పెద్దకుమార్తె అలేఖ్య మధ్యప్రదేశ్‌ ఉద్యోగానికి రాజీనామా చేసిన అలేఖ్య సివిల్స్‌కు సిద్ధమవుతోంది. రెండో కుమార్తె సాయిదివ్య ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్ ఇన్‌స్టిట్యూట్‌లో మ్యూజిక్‌ ప్రాక్టీస్ చేస్తోంది.

మూఢ విశ్వాసాలలో కుటుంబం మొత్తం మునిగిపోయారు. తల్లి పద్మజ పూజగదిలో చిన్న కుమార్తె సాయి దివ్యను శూలంతో పొడిచి, పెద్దకుమార్తె అలేఖ్యను డంబెల్‌తో నుదిటిపై మోది చంపింది. ఆ తర్వాత పురుషోత్తం తన మిత్రుడికి విషయమంతా చెప్పాడు. దీంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న పద్మజ, పురుషోత్తంలకు తొలుత తిరుపతి రుయా ఆస్పత్రిలో.. అనంతరం విశాఖపట్నం మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు. అనంతరం వారిని ఇటీవలే మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది.

Tags:    

Similar News