Visakhapatnam: విశాఖ జిల్లాలో క్వారీ బ్లాస్టింగ్ లో ప్రమాదం... కూలీ మృతి
Visakhapatnam: అనకాపల్లి మండలం బావులవాడ మధుఖాన్ క్వారీలో ఘటన...
Visakhapatnam: విశాఖ జిల్లాలో క్వారీ బ్లాస్టింగ్ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అనకాపల్లి మండలం బావులవాడ మధుఖాన్ క్వారీలో డ్రిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. చింతల సంతోష్ అనే కూలీ మృతి చెందాడు. మృతుడు చీడికాడ మండలం అప్పలరాజుపురం గ్రామానికి చెందిన వాడిగా గుర్తింపు. నెల రోజులు గడవక ముందే మరో బ్లాస్టింగ్ లో ప్రమాదం జరగడం ఆందోళన కల్గిస్తుంది. మృతుని కుటంబానికి తగిన న్యాయం చేయాలంటూ మృతుల బంధువులు డిమాండ్ చేశారు.