స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక ఉన్నది జగనే...అచ్చెన్నాయుడు

* టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు దీక్షకు సంఘీభావం * ఇవాళ విశాఖలో చంద్రబాబు బహిరంగసభ

Update: 2021-02-16 02:19 GMT

అచ్చెన్నాయుడు (ఫైల్ ఇమేజ్)

విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం ఉధృతమవుతోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ప్రైవేటీకరణపై సీఎం జగన్‌ నోరు మెదపాలంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నేతల బృందం కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్రను కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉదృతం అవుతోంది. ఎవరికి వారు ఉద్యమం చేస్తున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని నినాదిస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాకలో టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆమరణదీక్ష ఏడో రోజుకు చేరుకుంది. దాంతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇవాళ విశాఖలో టీడీపీ అధినేత విశాఖలో పర్యటించనున్నారు. దీక్ష చేస్తున్న శ్రీనివాస్ రావుకు బాబు సంఘీభావం తెలపనున్నారు. అనంతరం విశాఖలో భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

మరోవైపు, సీఎం జగన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనుక కర్త, కర్మ, క్రియ అంతా జగన్మోహన్‌రెడ్డేనని ఆరోపించారు. పోస్కోతో లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మిగులు భూమి 8వేల ఎకరాలను కాజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లారని చంద్రబాబు దుయ్యబట్టారు. అంతేకాదు, స్టీల్ ప్లాంట్ కోసం అందరం రాజీనామాలు చేద్దామంటూ వైసీపీకి సవాలు విసిరారు అచ్చెన్నాయుడు.

హుదు‍హుద్‌ను తట్టుకున్న విశాఖ.. స్టీల్‌ ప్లాంట్‌ను సీఎం జగన్‌, విజయసాయి లాంటి వారు ఏం చేయగలరని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై సీఎం జగన్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పురంధేశ్వరి, మాధవ్, విష్ణు్కుమార్‌రాజు కలిసి ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. మరోవైపు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. మొత్తానికి విశాఖ ఉక్కు ప్లాంట్‌ ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటు పరం కాకుండా చూసేందుకు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags:    

Similar News