ACB Rides: 16మంది సిబ్బందిపై వేటు
ACB Rides: విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో 5 రోజులపాటు కొనసాగిన ఏసీబీ తనిఖీలు, విచారణ సోమవారంతో ముగిశాయి.
ACB Rides: విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో 5 రోజులపాటు కొనసాగిన ఏసీబీ తనిఖీలు, విచారణ సోమవారంతో ముగిశాయి. ఈ దాడుల్లో ఆలయంలోని కీలకమైన విభాగాలన్నింటినీ ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొండపై జరుగుతున్న అనేక లోపాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రాథమిక రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేశారు.
ఈ రిపోర్ట్ ఆధారంగా 16 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్ పి.అర్జునరావు ఆదేశాలు విడుదల చేశారు. కనకదుర్గగుడి ఈవో సురేష్‌బాబుతో పాటు 6గురు సూపరింటెండెంట్లు, 9 మంది గుమాస్తాలపై వేటు పడింది. వీరిలో చీరలు, ప్రసాదాలు, అన్నదానం, స్టోర్ తదితర 8 విభాగాలకు చెందిన వారు ఉన్నారు. దేవాలయంలోని లడ్డూ ప్రసాదాలు, టికెట్లు, చీరల కౌంటర్లు, టోల్గేట్, కేశఖండనశాల, ప్రొవిజన్ స్టోర్, ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రాడ్ జరిగినట్లు ఏసీబీ అధికారులు రిపోర్ట్ లో వెల్లడించారు.
వేటు పడిన వారు:
- కె.శ్రీనివాసరావు - సూపరింటెండెంట్
- కె.శ్రీనివాసమూర్తి - సూపరింటెండెంట్
- ఎ.అమృతరావు - సూపరింటెండెంట్
- పి. భాగ్యజ్యోతి - సూపరింటెండెంట్
- కె.హరికృష్ణ - సూపరింటెండెంట్
- కూరెళ్ల శ్రీనివాసరావు - సూపరింటెండెంట్
- బి.నాగేశ్వరరావు - సీనియర్ అసిస్టెంట్
- జి.యశ్వంత్ - సీనియర్ అసిస్టెంట్
- ఎం.ఎస్.ప్రకాశరావు - జూనియర్ అసిస్టెంట్
- సీహెచ్.చెన్నకేశవరావు - జూనియర్ అసిస్టెంట్
- కె.రమేష్ - రికార్డు అసిస్టెంట్
- పి.రాంబాబు - రికార్డు అసిస్టెంట్
- పి.రవికుమార్ -రికార్డు అసిస్టెంట్
- రవిప్రసాద్ - సూపరింటెండెంట్
- పద్మావతి - సీనియర్ అసిస్టెంట్
- జె.ఏడుకొండలు - అటెండర్