Chandrababu Arrest: చంద్రబాబు పిటిషన్లపై నేడు విచారణ.. ఊరట లభించేనా?
Chandrababu Arrest: చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఏయే కేసులో వస్తుంది.
Chandrababu Arrest: చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఏయే కేసులో వస్తుంది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు బెయిల్ అంశం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఇవాళ ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు పిటిషన్లపై కీలక విచారణ జరగనుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్, రిమాండ్ రివ్యూ పిటిషన్లపై విచారణ జరపనుంది న్యాయస్థానం. మరో వైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా హైకోర్టులో విచారణ జరగనుంది. ఇటు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై స్టే ఇవాళ్టితో ముగియనుంది. దీంతో హైకోర్టులో వాదనలు కీలకం కానున్నాయి.
చంద్రబాబు పిటిషన్లపై న్యాయస్థానాల్లో విచారణ నేపథ‌్యంలో టీడీపీ కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. అటు కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనన్న ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో కొనసాగుతుంది. మరో వైపుకు తమ అధినేతకు ఎలాగైనా బెయిల్ వస్తుందనే ఆశతో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. మరో వైపు ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న లోకేష్‌ను ఏపీకి రాగానే అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం అలాంటి చర్యలకు పాల్పడకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన తర్వాత మరికొన్ని కేసులు తెరపైకి రావొచ్చని.. అప్పటివరకు చర్యలను ఉపక్రమించుకునే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే చర్చ జరుగుతోంది. వరుస అరెస్టులతో ప్రత్యర్థి శిబిరానికి సానుభూతి ఏర్పడవచ్చనే అంశాన్ని వైసీపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు.