AB Venkateswara Rao Case Updates: ఏబీ వెంకటేశ్వరరావు కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన జగన్ సర్కార్

AB Venkateswara Rao Case Updates: ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఉన్నత న్యాయస్థానం ఎత్తేసిన సంగతి తెలిసిందే.

Update: 2020-07-02 09:45 GMT
AB Venkateswara Rao (File Photo)

AB Venkateswara Rao Case Updates: ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను ఉన్నత న్యాయస్థానం ఎత్తేసిన సంగతి తెలిసిందే. ఆయన సస్పెన్షన్ చెల్లదని తేల్చి చెప్పింది. క్యాట్ ఇచ్చిన ఆర్డర్‌ను పక్కన పెట్టింది. ఈ కేసులో జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసింది. మే నెలలో వెంకటేశ్వరరావు రిట్ పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో పెండింగ్‌లో ఉన్న జీతభత్యాలను చెల్లించాలని ఆదేశించింది.

ఫిబ్రవరి 8న ప్రభుత్వం వేంకటేశ్వర రావును బాధ్యతల నిర్వహణలో అవినీతికి పాల్పడ్డారని, నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ నివేదిక సమర్పించారు. ఈ మేరకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైోర్టులో పిటీషన్ వేశారు.

తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని, 30 ఏళ్ల సర్వీసులో ఒక్క అవినీతి ఆరోపణ లేదని ఎన్నో అవార్డులు కూడా వచ్చాయన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మే 30న తనను ట్రాన్స్ఫర్ చేసి 8 నెలలుగా పోస్టింగ్‌ ఇవ్వలేదని, జీతం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. అయితే క్యాట్ కూడా ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను సమర్థించింది. ఆయన వేసిన ట్రిబ్యునల్ కొట్టేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వర్రావు 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు.


Tags:    

Similar News