ఏపీలో ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం
AP: ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కార్పొరేట్ వైద్య సేవలు నిలిపివేత
AP: ఏపీలో ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలగనుంది. ఏపీలో ప్రజలకు ప్రైవేటు హాస్పిటల్‌లో కార్పొరేట్ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరుతో పేదలకు ఉచితంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు.
ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన 1500కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషాకు ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల అసోసియేషన్ లేఖ రాశారు. సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయాల్సి వస్తుందని ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రులు లేఖలో తెలిపాయి.