AARA Exit Polls 2024: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైఎస్ఆర్సీపీ?
AARA Exit Polls 2024: ఆరా ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రెండోసారి విజయం సాధిస్తుంది.
AARA Exit Polls 2024: ఆరా ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రెండోసారి విజయం సాధిస్తుంది. వైఎస్ఆర్సీపీ 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆరా సంస్థ తెలిపింది. టీడీపీ కూటమి 71-81 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని ఆరా సంస్థ ప్రకటించింది.
ఇక పార్లమెంట్ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కువ స్థానాల్లో గెలుపొందనుందని ఆరా సంస్థ వివరించింది. టీడీపీ కూటమి 09 -12 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. వైఎస్ఆర్ సీపీ 13 స్థానాల్లో గెలుపొందనుందని ఆరా సంస్థ వివరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళ ఓటర్లలో 56 శాతం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపితే, టీడీపీ వైపు 43 శాతం మాత్రమే మొగ్గు చూపారని ఆరా సంస్థ వివరించింది. పురుషుల్లో ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గు చూపినట్టుగా ఆరా సంస్థ తెలిపింది. ఆరా సంస్థ సర్వే ప్రకారంగా టీడీపీకి 51 శాతం మంది పురుషులు మొగ్గుచూపితే వైఎస్ఆర్సీపీ వైపు 46 శాతం మాత్రమే నిలిచారు.
ఆంధ‌్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ అంచనా
వైసీపీ: 94-104
టీడీపీ కూటమి: 71-81
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ అంచనా
టీడీపీ: 09-12
వైసీపీ: 13