Kurnool: మేక కోసం వెళ్లి రాళ్లలో ఇరుక్కున్న యువకుడు
Kurnool: తాళ్ల సాయంతో యువకుడిని సురక్షితంగా బయటకు తీసిన స్థానికులు
Kurnool: కర్నూలు మండలం చెన్నంపల్లి గ్రామంలో ఓ యువకుడు బండరాళ్ల మధ్య ఇరుక్కున్నాడు. మేకలు కాచేందుకు వెళ్లిన యువకుడు రాజేష్.. సోమవారం సాయంత్రం తన మేక కనిపించడం లేదని వెదికాడు. అయినా కనిపించకపోవడంతో బండరాళ్ల మధ్య ఇరుక్కుందేమో అన్న అనుమానంతో రాళ్ల మధ్యలోకి వెళ్లాడు. దాంతో ఆ యువకుడు రాళ్ల మధ్యే ఇరుక్కున్నాడు. బయటకు వచ్చేందుకు వీలు కాక కాసేపు అల్లాడిన యువకుడు.. తన దగ్గర ఉన్న ఫోన్‌తో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడకు వెళ్లిన స్థానికులు తాళ్ల సాయంతో యువకుడిని బయటకు తీశారు.