Duvvada Railway Station: దువ్వాడ రైల్వే స్టేషన్ లో వరుస ప్రమాదాలు
Duvvada Railway Station: భద్రతా వైఫల్యమే కారణమని గుర్తించిన అధికారులు
Duvvada Railway Station: ఆ రైల్వే స్టేషన్ లో అడుగు పెట్టాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకావాల్సిందే.. రైలు దిగి క్షేమం గా బయటపడాలంటే అదృష్టం ఉండాల్సిందే .. విశాఖపట్నం మీదుగా ఒడిస్సా, కోల్ కత్తా మార్గం లో వెళ్ళే రైళ్లు దువ్వాడ రైల్వే స్టేషన్లో ట్రాక్ క్రాస్ ఆగుతాయి. వాల్తేర్ స్టేషన్ టచ్ చేయకుండానే నేరుగా లెవల్ క్రాసింగ్ రూట్ లో రైళ్ల రాకపోకలు సాగిస్తాయి. అయితే ఈ స్టేషన్ ప్రాణాలకు ముప్పుగా మారింది.
ప్రతి రోజు 50 రైళ్లు ఈ స్టేషన్ లో ఆగుతాయి. స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టు ల్లో పనిచేసి వేలాది మంది డైలీ టికెట్స్, మంత్లీ పాస్ ల తో ప్రయాణం చేస్తున్నారు. అయితే రైళ్లు కేవలం కొద్ది నిమిషాల మాత్రమే ఆగుతాయి. ఈ సమయం లో రైలు దిగే తొందరలో, ఎక్కే తొందరలో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నెలలో ఒక విద్యార్థి ఫ్లాట్ ఫామ్ మధ్యలో ఇరుక్కు పోయి నరక యాతన అనుభవించి ప్రాణాలు కోల్పోయింది. అంతకు ముందు ఓ వృద్ధుడు కూడా ఇదే తరహా ప్రమాదం లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు . ఈ వారం లో తుని నుంచి వస్తున్న ఒక వ్యక్తి రైలు నుంచి జారీ పడి రెండు కాళ్ళు కోల్పోయాడు. ఇలా వరుస దుర్ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేషన్ పేరు చెబితేనే ప్రయాణికులు భయపడి పోతున్నారు.
డిజిటల్ బోర్డు లు పనిచేయడం లేదని, ఎక్కడా భద్రత చర్యలు కనపడడం లేదని రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు drm కి పిర్యాదు చేశారు. ఈ ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరోవైపు ప్రజల విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు స్టేషన్ని సందర్శించారు . ప్రమాదాల తీరుని పరిశీలించారు..ఒకటి, నాలుగు ప్లాట్ ఫామ్ ల మీద ఎక్కువ ప్రమాదాలు జరిగినట్టు గుర్తించారు. ప్రయాణికుల అవగాహన కోసం హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. . ప్రమాదాలకు భద్రత వైఫల్యమే కారణమని అధికారులు సైతం గుర్తించారు.