Suicide: విషాదం.. పొలంలో ఉరి వేసుకుని నవ దంపతుల ఆత్మహత్య
Suicide: ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట
Suicide: శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం గంగంపల్లి గ్రామానికి చెందిన నవ దంపతులు తోటలో ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకున్నారు. గంగంపల్లి గ్రామానికి చెందిన దాదా అనే యువకుడు జోత్స్న అని యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చారు.
ఇరు కుటుంబాల్లో కొద్దిరోజులు స్వల్పవివాదం నెలకొంది. గ్రామ పెద్దల సమక్షంలో ఇరువు కుటుంబ సభ్యులు ఒప్పించి దాదా ఇంట్లోనే కాపురం ఉండేలా చేశారు. ఇంతలోనే ఏం జరిగిందో తెలియదు ఇద్దరూ కలిసి తోటకు వెళ్ళొస్తానని అక్కడికి వెళ్లి ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలమకున్నాయి.