CM Jagan: సీఎం జగన్ అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతల సమావేశం.. మళ్లీ పాతవారికే అవకాశం
CM Jagan: ఎన్నికలకు ముందు భారీ మార్పులు వద్దనుకుంటున్న వైసీపీ
CM Jagan: సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన పార్టీ ముఖ్యనేతలు సమావేశంకానున్నారు. ఎన్నికల ముందు కార్పొరేషన్ల ఛైర్మన్‌ల విషయంలో.. మార్పులు, చేర్పులు ఉండవంటున్నారు పార్టీ పెద్దలు. అయితే మళ్లీ పాతవారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యే అభ్యర్థులకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో అవకాశం ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పట్లో కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో మార్పులు లేనట్టేనని వైసీపీ హైకమాండ్ నేతలకు సూచనలు చేసింది. ఇందులో భాగంగానే.. ఎన్నికలకు ముందు భారీ మార్పులు వద్దనుకుంటోంది వైసీపీ... కసరత్తుకు బ్రేక్ వేసినట్టుగా సమాచారం. స్వల్ప మార్పులు మినహా యథాతథంగా పాతవారే కొనసాగించనున్నారు.