TTD: తిరుమలలో కీలక ఘట్టం..నెలరోజుల పాటు పుష్కరిణి మూసివేత

TTD: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.మంగళవారం భక్తుల దర్శనం సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేచిచూస్తున్నారు.

Update: 2024-07-30 05:15 GMT

TTD : తిరుమలకు వెళ్లే ప్లాన్‎లో ఉన్నారా..అయితే మీకు బిగ్ అలర్ట్..ఈ తేదీల్లో దర్శనాలు రద్దు

Tirumala News : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8గంటల సమయం పడుతోంది. శ్రావణ మాసం పురస్కరించుకుని తిరుమలలో కీలక ఘట్టానికి తెరలేవనుంది. నెలరోజుల పాటు శ్రీవారి ఆలయ పుష్కరిణిని టీటీడీ అధికారులు తిరుమల పుష్కరిణిని మూసివేయనున్నారు. ఇంకో రెండు నెలల్లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పుష్కరిణి వార్షిక నిర్వహణా పనులు చేపట్టేందుకు పుష్కరిణిని నెలరోజుల పాటు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేయనున్నారు. దీంతోపాటు నెలరోజులు పుష్కరిణి హారతి కూడా రద్దు అవుతుంది. నిర్వహణ పనుల్లో భాగంగా పుష్కరిణి జలాలను తోడివేసి..పైపు లైన్లకు మరమ్మత్తులను చేపడుతారు. సివిల్ పనులు కూడా పూర్తి చేస్తారు. మొదటి 10 రోజులపాటు నీటి తోడేస్తారు. ఆ తర్వాత 10 రోజులు మరమ్మత్తులు చేస్తారు. చివరి 10రోజులు పుష్కరిణిలో నీటిని నింపు పూర్తిగా రెడీ చేస్తారు. పుష్కరిణిలోని నీటి పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ విలువ 7 ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. పీహెచ్ 7 అనేది నీరు ఎంత శుద్ధిగా ఉందనే తెలుపుతుంది. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయి.

ఇక ఆగస్టు నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి టీటీడీ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్తత్రం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 7వ తేదీన ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర, శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేసే కార్యక్రమం.. ఆగస్టు 9న గరుడ పంచమిని పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి గరుడ సేవ..ఆగస్టు 10న కల్కి జయంతి, 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి వంటి కార్యక్రమాలు ఉంటాయి.


Tags:    

Similar News