మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు

Yarapathineni Srinivasa Rao: యరపతినేనితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Update: 2023-01-10 06:12 GMT

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు

Yarapathineni Srinivasa Rao: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. యరపతినేనితో పాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చింతలపూడి నిజయకుమార్‌ ఫిర్యాదు మేరకు ఏ1గా యరపతినేని, ఏ2గా దియ్యా రామకృష్ణ సహా మరో నలుగురు టీడీపీ నేతలపై పిడుగురాళ్ల పీఎస్‌లో కేసు నమోదైంది. గతరాత్రి దియ్యా రామకృష్ణ, ఇంతియాజ్‌‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిని నేడు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సోషల్ మీడియాలో యరపతినేని అనుచరులు, చింతలపూడి విజయ్‌కుమార్ మధ్య కామెంట్స్ నేపథ్యంలో పీఎస్‌లో కేసు నమోదైంది.

Tags:    

Similar News