School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఈ రోజు పాఠశాలలకు సెలవు
School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..మంగళవారం కూడా కొన్ని పాఠశాలలకు సెలవు ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..మంగళవారం కూడా కొన్ని పాఠశాలలకు సెలవు ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ హెచ్చరిక కూడా జారీ చేసింది. మూడు రోజుల పాటు వర్షాలు భారీగా కురుస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సెలవు ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అయితే ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే మాత్రమే ఈ సెలవు ఉంటుంది. అందువల్ల విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరింది. ఇంతకు సెలవు ఎక్కడ ఉందనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు,చిత్తూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు, అంగన్‌వాడీలకు సెలవు ఇచ్చారు. కలెక్టర్లు ఈ మేరకు కీలక ఉత్తర్వులను జారీ చేశారు. అందువల్ల ఈ జిల్లాల్లోని విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లయితే వాటిలో ఉన్న విద్యార్థులను సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రసవించే అవకాశం ఉన్న గర్భిణీలను కూడా ఆసుపత్రుల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యార్థులు కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండటం మంచిదని నిర్ణయించింది.