Guntur: గంజాయి బ్యాచ్ హల్‌చల్.. అపార్ట్‌మెంట్‌లో చొరబడి కర్రలు, రాడ్లు, బ్యాటులతో దాడి
Guntur: అపార్ట్‌మెంట్ ప్రెసిడెంట్, వాచ్‌మెన్ అడ్డుకోవడంతో వారిపైనా దాడి
Guntur: గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి బ్యాచ్ ఆగడాలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. గంజాయి మత్తులో యువత దాడులకు పాల్పడటం కలకలం రేపుతోంది. తెనాలిలోని నందులపేట కవిరాజ పార్క్ దగ్గర నలుగురు యువకుల గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. ఓ అపార్ట్‌మెంట్ దగ్గర కాలితో బైక్‌ను, ఆటోను తన్నుతూ వెళ్లాడు ఓ యువకుడు. ఎందుకు అని ప్రశ్నించిన సిమెంట్ దించుతున్న కూలీలపై అకారణంగా దాడికి పాల్పడ్డారు. స్థానికులు యువకులను అడ్డుకోవడంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు ఆ ఆకతాయిలు.
అనంతరం పది మందిని పోగు చేసుకుని అపార్ట్‌మెంట్‌పై అటాక్‌కు దిగారు. రాడ్లు, రాళ్లు, కర్రలు, బ్యాట్లు తీసుకొని అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. నలుగురు వ్యక్తులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గంజాయి బ్యాచ్ చేసిన వీరంగం అంతా అపార్ట్‌మెంట్‌లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది.