Coronavirus: ఏపీలో మళ్లీ భయపెడుతోన్న కరోనా
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇవాళ ఏకంగా 984మంది వైరస్ బారిన పడ్డారు. గత 24గంటల్లో 40వేల 604 శాంపిల్స్‌ను పరీక్షలు నిర్వహించగా 984మందికి వైరస్ సోకినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తేలింది.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 176 కేసులు నమోదు కాగా విశాఖ జిల్లాలో 170 చిత్తూరులో 163 కృష్ణాలో 110 అనంతపురంలో 46 తూర్పుగోదావరిలో 49 నెల్లూరులో 89 ప్రకాశంలో 27 కర్నూలులో 54 శ్రీకాకుళంలో 42 కడపలో 31 విజయనగరంలో 15 పశ్చిమగోదావరిలో 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక, కరోనా బారినపడి గత 24గంటల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. చిత్తూరు, విశాఖ ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దాంతో, ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7వేల 203కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4వేల 145యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది.