Anantapur: నిమ్మకాయ గొంతులో ఇరుక్కుని 9 నెలల పసికందు మృతి
Anantapur: గ్రామానికి చెందిన గోవిందరాజు, దీప దంపతుల కుమార్తె 9 నెలల చిన్నారి జస్విత ఇంట్లో ఆడుకుంటూ.. నిమ్మకాయ నోట్లో పెట్టుకోగ.. అది గొంతులో ఇరుక్కుంది.
Anantapur: ముక్కు పచ్చలారని చిన్నారిని ఓ నిమ్మకాయ బలిగొంది. ఆడుకుంటూ నిమ్మకాయను మింగిన చిన్నారి.. ఊపిరాడక మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా మల్లేనిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన గోవిందరాజు, దీప దంపతుల కుమార్తె 9 నెలల చిన్నారి జస్విత ఇంట్లో ఆడుకుంటూ.. నిమ్మకాయ నోట్లో పెట్టుకోగ.. అది గొంతులో ఇరుక్కుంది. బయటికి తీయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించినా.. విఫలమయ్యారు. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా... అక్కడా వీలుకాలేదు. అనంతపురం తీసుకెళ్తుండగా... మార్గమద్యంలోని పామిడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అప్పటికే చిన్నారి శ్వాస ఆగిపోయిందని వైద్యులు తెలిపారు. అక్కడినుంచి అనంతపురం తీసుకెళ‌్లగా.. అప్పటికే చిన్నారి మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.