Coronavirus: ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.
Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిన్నమొన్నటివరకు రెండు వందల్లోపే కేసులు నమోదు కాగా ఇప్పుడు ఏకంగా 7వందలు దాటేశాయి. గత 24గంటల్లో 35వేల 196 శాంపిల్స్‌ను పరీక్షలు నిర్వహించగా 758మందికి వైరస్ సోకినట్లు తేలింది.
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 175 కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 127, విశాఖలో 98 కృష్ణాలో 80 అనంతపురంలో 56 తూర్పుగోదావరిలో 45 నెల్లూరులో 33 ప్రకాశంలో 30 కర్నూలులో 27 శ్రీకాకుళంలో 27. కడపలో 24 విజయనగరంలో 23 పశ్చిమగోదావరిలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక, కరోనా బారినపడి గత 24గంటల్లో మరో నలుగురు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు గుంటూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దాంతో, ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7వేల 201కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల 469 యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది.