Corona Cases in AP: గడిచిన 24గంటల్లో 1,578 మందికి పాజిటివ్

Corona Cases in AP: గడిచిన 24గంటల్లో 1,578 మందికి పాజిటివ్ * కోవిడ్‌తో మరో 22 మంది మృతి

Update: 2021-07-12 12:30 GMT

Representational Image

Corona Cases in AP: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 62 వేల 657 శాంపిల్స్ పరీక్షిస్తే.. అందులో 15 వందల 78 మంది పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 19 లక్షలు దాటింది. కరోనా నుంచి కోలుకుని మరో 3 వేల 41 మంది వివిధ ఆస్పత్రిల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్‌ను జయించిన వారి సంఖ్య 18 లక్షలు దాటింది. తూర్పుగోదావరి లో 305, చిత్తూరులో 257 చొప్పున అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఏపీలో 24 గంటల్లో కరోనా సోకి మరో 22 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 13 వేల 24కి చేరింది. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, కర్నూలు, విశాఖలో ఒక్కరు చొప్పున బాధితులు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 27 వేల 195 యాక్టివ్ కేసులున్నాయని హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. 

Tags:    

Similar News