Andhra Pradesh: ఆరు నెలలకే నోబెల్ వరల్డ్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్న బుడ్డోడు

Andhra Pradesh: తన తల్లి చూపించిన జంతువులు, పండ్లు, వాహనాలు, పక్షుల వాహనాల ఫోటోలను టక్కున గుర్తిస్తున్న చిన్నారి

Update: 2023-08-01 08:58 GMT

Andhra Pradesh: ఆరు నెలలకే నోబెల్ వరల్డ్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్న బుడ్డోడు

Andhra Pradesh: ఆరు నెలల వయసున్న ఓ బుడ్డోడు ఏం చేస్తుంటాడు. ఏముంది హాయిగా ఆడుకుంటూ, ఏ బెంగ లేకుండా ఉంటాడు అంటారా.? అయితే ఓ కుర్రాడు మాత్రం ఆరు నెలల వయసులోనే ఏకంగా నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్నాడు. ఆరు నెలల బుడ్డోడు ఏంటి.? నోబెల్ వరల్డ్‌ రికార్డ్‌ సొంతం చేసుకోవడం ఏంటని.? ఆశ్చర్యపోతున్నారా.? అవును నిజమే ఆరు నెలల బుడ్డోడు అపర మేధావిలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు అంతలా ఏం చేశాడు, నోబెల్‌ వరల్డ్‌ రికార్డ్ ఎందుకు వరించింది.? చూద్దాం.

పుట్టిన ఆరు నెలలకు తల్లితండ్రులను గుర్తుపట్టడమే కొంత కష్టంగా ఉండే ఆ వయసులో చూసింది చూసినట్టు టక్కున గుర్తుపట్టేస్తున్నాడు ఈ బుడతడు . ఆరు నెలలకే అపర మేధావిలాగా తయారైన ఈ బుడతడి వీడియోకి నోబెల్ వరల్డ్ రికార్డ్ అవార్డు లభించింది. కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలోని శాస్త్రి నగర్ కు చెందిన పవన్ కుమార్ ,సౌమ్య అనే దంపతుల కు 6 నెలల ప్రజ్వల్ అనే చిన్నారి ఉన్నాడు. ఈ బుడతడు తన తల్లి చూపించిన జంతువులు, పండ్లు, వాహనాలు, అంకెల ఫోటోలను టక్కున గుర్తిస్తున్నాడు. తల్లి తన చిన్నారి వీడియోను తీసి నోబెల్ వరల్డ్ రికార్డ్ వారికి పంపించింది.

ప్రజ్వల్ వీడియోలు చూసిన సదరు సంస్థ ప్రతినిధులు ఆ చిన్నారికి ఆన్ లైన్‌లో నోబెల్ వరల్డ్ రికార్డ్ అవార్డును పంపించారు. ఆరు నెలలకే ఈ అవార్డు సాధించిన బుడతడి అమోఘమైన తెలివితేటలు చూసి చుట్టుపక్కల వారందరూ ముక్కున వేలేసుకున్నారు. తమ చిన్నారికి వచ్చిన ఈ అవార్డుతో తల్లిదండ్రులు మంచి జోష్ లో ఉన్నారు. పవన్ కుమార్ ,సౌమ్యల కుమార్తె వినిష కూడా రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ..ప్లాష్ కార్డ్స్‌ను గుర్తించడంతో ఆ వీడియోను కూడా తీసి వరల్డ్ రికార్టు సంస్ధకు పంపించారు. దీంతో చిన్నారి వినిష కూడా నోబెల్ రికార్డు వంటి ఐదు రికార్డులను పాప సొంతం చేసుకుంది.

Tags:    

Similar News