పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. గీతికా స్కూల్ వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధరించారు.
మృతులను శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్తకారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారు