Corona: కర్నూలు ఆస్పత్రిలో దారుణం.. ఆక్సిజన్ అందక నలుగురు రోగులు మృతి

Corona: ఊపిరి అందక నలుగురు కరోనా రోగులు మృతి * అనుమతి తేకుండా కోవిడ్ వైద్యం చేస్తున్న ఆస్పత్రి

Update: 2021-05-01 11:46 GMT

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం 

Corona: కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. ఆక్సిజన్ అందక నలుగురు కోవిడ్ పేషెంట్స్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలోని కేఎస్ కేర్ ఆస్పత్రిలో నలుగురు కరోనా రోగులు ఊపిరి అందక మృతి చెందారు. ఎటువంటి అనుమతులు లేకుండానే రోగులకు కోవిడ్ వైద్యం చేస్తున్నారని తెలియడంతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆస్పత్రిపై విచారణకు ఆదేశించారు. కర్నూలు కలెక్టర్ ఆదేశాలతో డీఎంహెచ్‌ఓ విచారణ ప్రారంభించింది.

మరోవైపు.. ఒక్కసారిగా నలుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో మిగిలిన పేషెంట్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆక్సిజన్ లేక ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిన పరిస్థితులు తలెత్తడంతో.. పేషెంట్లు వేరే ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అటు.. ఘటన జరిగిన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం అందుబాటులో లేకుండా పోయింది. దీంతో నేరుగా రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ వీర పాండియన్ వెంటనే విచారణ చేపట్టాల్సిందా అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News