ఏపీలో నేటి నుంచి మూడో విడత ఎన్నికల నామినేషన్లు
* ఈ నెల 8న నామినేషన్ల దాఖలుకు తుది గడువు, 9న నామినేషన్ల పరిశీలన * ఈ నెల 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం
ఏపీలో నేటి నుంచి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 13 జిల్లాల్లోని 19 రెవెన్యూ డివిజన్లలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 8న నామినేషన్ల దాఖలు చేసేందుకు తుది గడువు. 9న నామినేషన్లను పరిశీలించనున్నారు. ఈనెల 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఫిబ్రవరి 17న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది.