ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,892 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 69,463 శాంపిల్స్‌ని పరీక్షించగా 3,892 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 5,050 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో నలుగురు చొప్పున.. తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి మరణించారు. అనంతపురం, శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున మృతిచెందగా.. కర్నూలు, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు మరణించారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,67,465కి చేరింది. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 6,319కి చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,16,582కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 41,669 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 67,72,273 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.