Corona Cases in AP: ఏపీలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు
Corona Cases in AP: ఏపీలో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.
Corona Cases in AP: ఏపీలో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ స్వల్పంగా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో లక్షకు పైగా శాంపిల్స్ పరీక్షిస్తే అందులో 3వేల 40 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 19లక్షలు దాటినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తూర్పుగోదావరిలో 659, చిత్తూరులో 441, ప్రకాశంలో 316, పశ్చిమగోదావరిలో 297, కృష్ణాలో 242, గుంటూరులో 211 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఏపీలో కరోనాతో మరో 14 మంది మృతి చెందారు. దాంతో మృతుల సంఖ్య 12 వేల 960కి చేరింది. తూర్పుగోదావరిలో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24గంటల్లో 4 వేల 576 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో కోవిడ్‌ను జయించిన వారి సంఖ్య 18 లక్షలు దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల 300 యాక్టివ్ కేసులున్నట్టు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.