World Record: మూడేళ్ల బాలుడు ప్రపంచ రికార్డు

World Record: అతి చిన్నవయసులో రామాయణ పారాయణం రాష్ట్రాల రాజధానుల పేర్లను టకా టకా చెబుతున్న కార్తీక్‌

Update: 2021-08-16 07:28 GMT

తూర్పు గోదావరి జిల్లాలో 3 ఏళ్ళ బాలుడు వరల్డ్ రికార్డు (ఫైల్ ఇమేజ్)

World Record: మేధో సంపత్తి ఏ ఒక్కరి సొత్తు కాదు. దైవానుగ్రహం అది. అతి చిన్న వయసులో రామాయణాన్ని ఆసాంతం అలవోలకగా వల్లించడం సాధారణ విషయం కాదు. అదీ మూడేళ్ల వయస్సులో. అలాంటిది చిచ్చర పిడుగు, మూడేళ్ళ బాలుడు పెనుమర్తి కార్తీక్‌ ఇట్టే సంస్కృత శ్లోకాలు వల్లిస్తాడు. అద్భుత జ్ఞాపకశక్తి, అపూర్వ మేధా సంపత్తి అతనికి వరం. దీంతో.. మూడేళ్ల వయస్సులోనే ప్రపంచ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు కార్తీక్.

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వెలగతోడుకు చెందిన పెనుమర్తి వెంకట్రాజు, సరోజిని దేవిల ఏకైక కుమారుడు కార్తీక్ ఈ బుడ్డోడు ఆలవోకగా సంస్కృత శ్లోకాలు వల్లిస్తాడు. రామాయణంలో సీతారాముల జీవిత చరిత్రకు సంబంధించి ఏ ప్రశ్న అడిగినా టక్కున సమాధానం ఇస్తాడు. గజిబిజి పద్దతిలో పలు ప్రశ్నలు అడగినా అన్నింటికి బాలుడు కార్తీక్‌ చక్కగా సమాధాన మిచ్చి.. అందరినోట హౌరా అనిపించుకుంటున్నాడు. ఇప్పటికే అతి పిన్న వయస్సులోనే అద్భుతమైన జనరల్‌ నాలెడ్జ్‌ ఉన్న.. కార్తీక్‌.. ఛాంపియన్స్ ఆప్ వరల్డ్ రికార్స్, భారత్ టాలెంట్స్ అవార్డ్స్ లలో స్థానం సంపాదించాడు. వెలగతోడు గ్రామ ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేశాడు.

8 నెలల వయస్సులోనే కార్తీక్ జ్ఞాపకశక్తిని తాను గుర్తించడం జరిగిందని, ఏదో ఒక క్రీడా విభాగంలో తన కుమారుడిని ఒలింపిక్ గేమ్స్ కు పంపించాలన్నదే తన ఆశయమని కార్తీక్ తల్లి సరోజిని దేవి వెల్లడించారు. అద్భుతాలు ఎప్పుడో, ఎక్కడో జరుగుతూనే ఉంటాయి. వాటిని గుర్తించడమేకాక ప్రోత్సాహం ఇవ్వడం కనీస బాధ్యత. ప్రభుత్వాలు కూడా ఇటువంటి వారికి తగు ప్రోత్సాహం ఇస్తే పసిడి పతకాలకు కొదవ ఉండదు. ఇకనైనా ఆ దిశగా పాలకులు నిర్ణయాలు చేయాలని ఆశిద్దాం.

Tags:    

Similar News