Coronavirus: ఏపీలో కరోనా విజృంభణ

Coronavirus: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మరోసారి 300 మందికి కరోనా సోకింది.

Update: 2021-03-21 14:26 GMT

Coronavirus: ఏపీలో కరోనా విజృంభణ

Coronavirus: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మరోసారి 300 మందికి కరోనా సోకింది. గత కొంతకాలంగా తగ్గిందనుకున్నా మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. గడిచిన 24గంటల్లో 31వేల 138 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 368 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఒకవైపున కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నా మరోవైపు కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఇవాళ నమోదు అయిన కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 79 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో 49, అనంతపురం జిల్లాలో 40 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అదే సమయంలో 263 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.


Tags:    

Similar News