Andhra Pradesh: 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్

Andhra Pradesh: సీఎం జగన్ ను 2008 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. వారికి జరిగిన నష్టాన్ని సీఎంకు వివరించారు.

Update: 2021-06-09 11:07 GMT

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: సీఎం  జగన్ ను 2008 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. వారికి జరిగిన నష్టాన్ని సీఎంకు వివరించారు. వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని జగన్ హమీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కట్రామిరెడ్డి మాట్లాడుతూ.. 2008 డీఎస్సీలో అభ్యర్థులకు జరిగిన నష్టాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్ళామ‌ని చెప్పారు. వారిని కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసుకోవాలని నిర్ణయించార‌ని చెప్పారు. దీని ద్వారా 2193 మందికి సీఎం నిర్ణయం వల్ల లబ్ది చేకూరుతుందని ఆయ‌న అన్నారు.

సచివాలయం ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని సీఎం కోరామన్నారు, వారిని రెగులర్ చేయడానికి అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాట్లాడతూ ఈ ఏడాది అక్టోబర్ 2కి మా ప్రొబేషన్ సమయం పూర్తి అవుతుంది ..మమ్మల్ని రెగ్యులర్ చేయాలని సీఎంని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. 1.38లక్షల మందీని రెగ్యులర్ చేయదానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభించమని అధికారులను సీఎం ఆదేశించారు. 

Tags:    

Similar News