Gannavaram: గన్నవరంలో 144 సెక్షన్.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు:ఎస్పీ జాషువా
Gannavaram: పట్టాభి వ్యాఖ్యలతో శాంతిభద్రతల సమస్య తలెత్తిందన్న ఎస్పీ జాషువా
Gannavaram: గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ శ్రేణుల ఛలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ జాషువా ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న పట్టాభి వ్యాఖ్యలతోనే శాంతిభద్రతల సమస్య తలెత్తిందని ఎస్పీ తెలిపారు. టీడీపీ ఆఫీసుపై దాడి వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నామన్నారు. నిన్న జరిగిన ఘటనలో 60 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. పట్టాభి సహా 16మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.మొత్తంగా గన్నవరం పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు.