మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టైన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం అరెస్ట్ చేసిన అచ్చెన్నను అర్ధ రాత్రి దాటాక ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు, దీంతో అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అనారోగ్యం దృష్ట్యా ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని ఆదేశించారు .ఏసీబీ అధికారులు విజయవాడ సబ్ జైలుకు ఆయన్ను తరలించారు.
మరోవైపు రాత్రి ఏసీబీ కార్యాలయంలోనే అచ్చెన్నాయుడు నిద్రించారు. అచ్చెన్నాయుడు ఆపరేషన్ అయిందన్న విషయం తెలుసుకున్న న్యాయమూర్తి.. ఆయనకు గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయాలని ఆదేశించారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి, అందించే వైద్యం గురించి కోర్టుకు నివేదిక ఇవ్వాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు న్యాయమూర్తి.