AP 10th Marks Memo : 10వ తరగతి మెమోలు వచ్చాయ్.. చూసుకోండి ఇలా..

AP 10th Marks Memo : పదో తరగతి.. విద్యార్ధులకి ఇదో పెద్ద టర్నింగ్ పాయింట్.. వారి ఉన్నత చదువులకి ఇదో పునాది.. దీనికోసం రాత్రి పగలు ఎంతో కష్టపడి

Update: 2020-08-13 10:52 GMT
students write exam(File Photo)

AP 10th Marks Memo : పదో తరగతి.. విద్యార్ధులకి ఇదో పెద్ద టర్నింగ్ పాయింట్.. వారి ఉన్నత చదువులకి ఇదో పునాది.. దీనికోసం రాత్రి పగలు ఎంతో కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించుకోవాలని అనుకుంటారు.. మంచి మార్కులు సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుదని తల్లిదండ్రులు కూడా వారిని బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలలో పదో పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులగా ప్రకటిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి..

ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం పదోతరగతి మర్క్స్ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు బోర్డ్ వెబ్ సైట్ లో మార్స్ మెమెలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీనికి గాను https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తీసుకోవచ్చని తెలిపింది. ఇక లాంగ్ మెమోలను విద్యార్ధుల స్కూళ్లకు పంపనుంది. ఇక విద్యార్థులు తమ స్కూళ్ల నుంచి ఒరిజినల్ మార్క్స్ మెమోలు తీసుకోవచ్చని వెల్లడించింది.

ముందుగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ లింక్ ని ఓపెన్ చేసి.. అక్కడ మీకు కనిపించే SSC public examination March 2020 student results&short memo without photo అనే లింక్ పై క్లిక్ చేయాలి. అప్పుడు అక్కడ రోల్ నెంబర్ ఎంటర్ చేసి..సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే... స్క్రీన్ పై పదో తరగతి మార్క్ లిస్ట్ కనిపిస్తుంది. దానిని ఓసారి చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది.. ఇక ఒరిజినల్ మెమోల కోసం సంబధిత స్కూల్స్ కి వెళ్ళాలి  

Tags:    

Similar News