జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలపట్ల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలపట్ల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్న వారిని, కొన్ని ప్రత్యేక కేసులలో ఉన్న వారిని విడుదల చేస్తున్నాట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు.
జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలపట్ల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్న వారిని, కొన్ని ప్రత్యేక కేసులలో ఉన్న వారిని విడుదల చేస్తున్నాట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. క్షణికావేశంలో చేసిన నేరంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారని.. వారిలో సత్‌ప్రవర్తన తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంతేకాదు.. జైళ్లలో ఉన్న వారికి కుట్టు, ఎంబ్రాయిడరీ, అల్లికలు వంటి చేతి వృత్తులను నేర్పిస్తున్నాట్టు స్పష్టం చేశారు..దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ విడుదల చేశారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళా జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.. దీనికి సంబంధించిన కసరత్తుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.