స్త్రీని పుష్పంతో పోలుస్తారే...! అలాంటిది ఇదేం బుద్ధి...?
స్త్రీని పుష్పంతో పోలుస్తారే...! అలాంటిది ఇదేం బుద్ధి...?
మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే స్త్రీలది అతి సున్నితమైన మనసని మన పెద్దలే కాదు, పురాణాలు కూడా ఘోషిస్తున్నాయి. తన రక్తాన్ని స్థన్యంగా మార్చి పిల్లల్ని తీర్చి దిద్దుతుంది స్త్రీ. తాను పదిమంది పిల్లల్ని కన్న తరువాత పదకొండవ పిల్లవాణ్నిగా తన భర్తని లాలించి కాపాడుకుంటుంది ఒక స్త్రీ. అలాంటి స్త్రీలు ఈరోజుల్లో తమ సున్నిత మనస్తత్వాన్ని కోల్పోతున్నారు. దేనివల్ల ప్రభావితులవుతున్నారో ఎవరికైనా గోచరమవుతోందా...? సమాజంలో విశృంఖలత్వానికి దారి తీస్తున్న దుస్తుల సంప్రదాయం ఒక ఎత్తైతే టీవీ లో చూపిస్తున్న సీరియల్స్ ప్రభావం ఇంకొక ఎత్తు.
అయినా తెలియక అడుగుతున్నాను. సమాజంలో ఇలాంటివి చూస్తూ స్త్రీలు నిజంగా ప్రభావితులవ్వాలా..? ఏం..? స్త్రీలు ఎంతో విజ్ఞులే..! అన్నిట్లోనూ పురుషులకంటే ముందంజలో ఉంటున్నారే...? అలాంటిది అంత తొందరగా ప్రభావితులయి కాపురాల్ని కూల్చడం, గొంతులు కోసేయ్యటం, పెళ్లి నిశ్చయమయ్యాక ఇంకొకరితో లేచిపోవడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం చేస్తున్నారు...? ఇదెక్కడి సంప్రదాయం...? తల్లితండ్రులు పిల్లల్ని పెంచడంలో లోపమా..? లేక సమాజమే ఇలా తయారవుతోందా...? లేక కలియుగ ప్రభావమా...? మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా తెలుసుకుందాం.