ఆమె ఓ ఉన్నతాధికారి. అయినా అన్నదాతల్లో స్ఫూర్తి నింపడానికి కూలీగా మారారు. నాగలి పట్టి కూలీలతో పాటు నాట్లు వేశారు. వారితో పాటే భోజనం చేసి.. కూలీ కూడా ఇప్పించుకున్నారు. ఆమె ఎవరో కాదు ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్. ములుగు జిల్లా జాకారం వెళ్లిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా వరి పొలంలో నాగలి పట్టి దుక్కిదున్నారు. రైతు వ్యవసాయానికి దూరమైతే మానవ మనుగడ కనుమరుగవుతుందని రైతుకు మేమున్నాం అనే భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు తస్లీమా.