తన తల్లిని బాధ్యతగా చూసుకుంటేనే పెళ్లి చేసుకోండి..!
Marriage: ఈరోజుల్లో ఎంతో పెద్ద చదువులు చదువుకుంటున్నారు...
Marriage: మీ Mobile Phone లో Telegram App ని Download చేసుకుని Matrimony India Channel లో Join అవ్వండి. మీరు మెచ్చిన, మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకుని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే పెళ్ళైన దంపతులని పుత్రసంతాన ప్రాప్తిరస్తు అని దీవిస్తారు మన పెద్దలు. కారణం... కనీసంలో కనీసం తల్లితండ్రులు చనిపోయిన తరువాత తలకొరివి పెడితే ఊర్ధ్వలోకాలలో తమకి కొంచమైనా విముక్తి లభిస్తుందని. కానీ ఇదేమి చోద్యమో కానీ పెళ్ళైన మరుక్షణం పురుష పుంగవులు మారిపోతున్నారు. అన్నదమ్ముల అనుబంధం జ్ఞ్యాపకానికి రాదు. పెంచి పోషించిన తల్లితండ్రుల్ని పట్టించుకోరు.
పట్టించుకోకపోగా వేరు కాపురం పెట్టడమో లేక వాళ్ళని వృద్ధాశ్రమంలో ఒదిలెయ్యడమో చెయ్యడం. నిజంగా చాలా విచారకరమైన విషయం. ఈరోజుల్లో ఎంతో పెద్ద చదువులు చదువుకుంటున్నారు. దీనితో పాటు విజ్ఞత పెరగాలి కానీ ఇలా లోపించడం బహు విచారకరం మరియు ప్రమాదకరం కూడా. కానీ ఒక్క విషయం. పెళ్లిళ్లు కావలసిన ఆడపిల్లలు వారికి తగ్గ భాగస్వామిని ఎంచుకునేటప్పుడు అసలు వాడు వాడి తల్లితండ్రుల్ని బాధ్యతనెరిగి ప్రవర్తిస్తున్నాడా...? లేదా..? అని చూసుకుని వివాహం నిశ్చయించుకుంటే చాలా చాలా మంచిది. ఎందుకంటె వాడి తల్లితండ్రుల్ని బాధ్యతగా చూసుకుంటున్నాడు కాబట్టి తన భాగస్వామిని కూడా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఇది సత్యం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆడపిల్లల జీవితం ఒక పూబాట...! మరిన్ని విషయాలు శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారి ద్వారా తెలుసుకుందాం.