ఆ ఇంటికి నిత్యం వందల సంఖ్యలో అతిధులు వచ్చి కడుపునిండా తింటారు. అలా తింటుంటే ఆ యాజమానికి కడుపు నిండుతుంది. ఇలా పదేహేను ఏళ్ళగా నిత్యకృత్యమైపోయింది. ఇంతకి ఎవరా అతిధులు, ఎందుకు అతనింటికే ఆ అతిధులు వస్తున్నారు తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే
చీకటిని చీల్చుకుంటూ, బానుడి లేలేత కిరణాలు తాకుతుంటే, పక్షులు కిలకిలరావాలు మేల్కొల్పుతుంటే ఆ అనుభూతే వేరు. గిరిజనులకు, పల్లె ప్రాంత ప్రజలకే సొంతం అనుకుంటున్న పక్షుల కిలాకిలారావాలు విశాఖవాసిని పలకరిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో రామచిలుకలు, పావురాలు వచ్చిపోతుంటాయి.
ఇతని పేరు లక్ష్మీనారాయణరెడ్డి. ఇతని ఇంటికి ప్రతీరోజు వందల సంఖ్యల్లో రామచిలుకలు, పావురాలు వచ్చి కడుపు నింపుకుంటున్నాయి. ఈ ప్రక్రియ గత పదిహేను ఏళ్లుగా కొనసాగుతోంది. లక్ష్మీనారాయణ తినే వేళల్లో మార్పు వస్తుందేమో గానీ ఆ మూగ జీవాలకు అందించే ఆహార గింజల విషయంలో తేడా రాదు. అసలు ఈ పక్షులు ఇక్కడికే ఎందుకొస్తున్నాయో అతన్నే అడిగి తెలుసుకుందాం.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..