కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ బిల్లులు చారిత్రాత్మకమే అయితే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడం లేదు? అని రాష్ర్ట ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. రెవెన్యూ బిల్లును తెలంగాణ చట్టసభలు ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబురాలు జరిగాయని, బిల్లుపై రైతులోకం పూర్తిస్థాయిలో హర్షించిందని గుర్తు చేశారు. కేంద్ర వ్యవసాయ బిల్లులు రైతులకు ప్రయోజనం చేకూర్చినవైతే ఎన్టీయే మిత్రపక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు.