ఆ మంత్రిపై కార్యకర్తలు అలిగారా? ఇంతకుముందులా లేరని ఫీల్ అవుతున్నారా? ఏమైందసలు. ఆర్థిక శాఖ అమాత్యని ఇలాకాలో అసంతృప్త జ్వాలలు తారాస్థాయికి చేరుకుంటున్నాయా? ఓ స్థాయి నేతల నుంచి ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలందరూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారా? పదేళ్ల పాటు విపక్షంలో ఉండి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అందలానికి దూరంగా ఉండే పరిస్థితిని తలుచుకుంటూ కుమిలిపోతున్నారా? అలా తమ నేతను విమర్శించ లేక తలలు పట్టుకుంటున్నారా? డ్రోన్ నియోజకవర్గంలోని అధికార పార్టీని నమ్ముకున్న వారు ఏమంటున్నారు?