కరోనాతో చనిపోయిన వ్యక్తి అంతిమ సంస్కారాలు నిర్వహించి మనిషితనం చాటిన HMTV రిపోర్టర్ ఉదయ్
కరోనాతో చనిపోయిన వారిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో తనకు ఏమీ కాని వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించి మనిషితనం చాటుకున్నారు HMTV రిపోర్టర్ ఉదయ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన బీజేపీ నాయకుడు కుటుంబ రావు కరోనా తో చికిత్స పొందుతూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందారు ఆయన మృతదేహాన్ని ఇల్లందు తరలించడానికి ఎవరూ ముందుకు రాని విషయం తెలుసుకున్న ఇల్లందు hmtv రిపోర్టర్ ఉదయ్ తనకున్న పరిచయాలతో మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు తీరా మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసేందుకు అందరూ భయపడుతున్న సమయంలో తానే స్వయంగా పీపీయి కిట్ ధరించి వాహనం నుండి బాడీని బయటకు తీసుకువచ్చారు ఆయన స్పూర్తితో మరికొందరు ముందుకు రావడంతో అందరూ కలిసి కరోనా మృతుడి అంత్యక్రియలు పూర్తి చేశారు
ప్రస్తుత సమాజంలో కరోనా వచ్చిన రోగిని చూస్తేనే సొంత కుటుంబ సభ్యులే అల్లంత దూరంగా వెళుతున్న సందర్భంలో తనకు ఏమి కానీ వ్యక్తి కరోనా తో చనిపోయారని తెలిసినా మానవత్వం తో ముందుకు వచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించిన hmtv రిపోర్టర్ ఉదయ్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
Hmtv ఇల్లందు రిపోర్టర్ ఉదయ్ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్....
కరోనా మృతదేహానికి ధైర్యంగా అంతిమ సంస్కారాలు చేసిన ఉదయ్ ని అభినందించిన బండి సంజయ్. మానవత్వం చాటిన hmtv ఇల్లందు రిపోర్టర్ ఉదయ్ కి ఫోన్ లో అభినందనలు తెలిపిన బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరోనా వైరస్ పై ఫ్రెంట్ వారియర్స్ గా పని చేస్తున్న జర్నలిస్టులు, తమ వృత్తితో పాటు మానవత్వన్ని చడం అభినందనీయం. కరోనా వైరస్ వస్తే అంటారనిగా చూడటం తగదు. రిపోర్టర్ ఉదయ్ చేసిన కార్యం మాటల్లో వెలకట్టలేనిది. ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..a